వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు: స్థానిక ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ప్రతి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
- మండల కేంద్రమైన దుత్తలూరులోని జేఎస్ఆర్ ఫౌండేషన్లో మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకమత్యమే మహాబలమని, స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
దుత్తలూరు: స్థానిక ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ప్రతి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన దుత్తలూరులోని జేఎస్ఆర్ ఫౌండేషన్లో మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకమత్యమే మహాబలమని, స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ఎన్నికల్లో సమష్టి కృషితో విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు.