Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

తెలంగాణ భవన్‌లో ఘనంగా ‘జన నాయకుడు’ పుస్తకావిష్కరణ.. ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తెలంగాణ భవన్‌లో ఘనంగా ‘జన నాయకుడు’ పుస్తకావిష్కరణ.. ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వార్త ముఖ్యాంశాలు

  • నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన "జన నాయకుడు" పుస్తకాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఘనంగా ఆవిష్కరించారు.
  • ​బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించబడింది.
  • అనంతరం ఈ పుస్తక ప్రతిని పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి శ్రీమతి పెద్ది స్వప్న గారికి అందజేశారు.

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన “జన నాయకుడు” పుస్తకాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఘనంగా ఆవిష్కరించారు.
​బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించబడింది. అనంతరం ఈ పుస్తక ప్రతిని పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి శ్రీమతి పెద్ది స్వప్న గారికి అందజేశారు.
​యువ సాహిత్య రత్న, ప్రముఖ సామాజిక రచయిత శ్రీ కడియాల సురేష్ కుమార్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో సుదర్శన్ రెడ్డి గారి బాల్యం, విద్య, 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్ర, నల్లబెల్లి జడ్పీటీసీగా, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా మరియు 2018-2023 నర్సంపేట ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవలు, ప్రజా పోరాటాలు అత్యంత స్పష్టంగా పొందుపరచబడ్డాయి.
​ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ అత్యంత సన్నిహితుడని, పార్టీ కోసం అంకితభావంతో పని చేసిన గొప్ప నాయకుడని, ఆయన అకాల మృతి పార్టీకి తీరని లోటు అని కొనియాడారు.
​ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నల్లబెల్లి మండల నాయకులు, BRTU జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, సర్పంచ్ మూర్తి, మనోహర్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, పుస్తక రచయిత కడియాల సురేష్ కుమార్‌ను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *