Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరులో ఎన్నికల నగారా!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరులో ఎన్నికల నగారా!

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు,అక్టోబర్‌ 16 (కోటకొండ హరికిరణ్-పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు.
  • ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో పట్టణంలో రాజకీయ సందడి మొదలైంది.
  • అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా మున్సిపల్‌ కార్యాలయంలో ఐదు కౌంటర్లను ఏర్పాటు చేశారు.

నేటి నుంచే నామినేషన్లు.. ఐదు కౌంటర్లు ఏర్పాటు

– అక్టోబర్‌ 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ

– 28న పోలింగ్‌.. 30న ఓట్ల లెక్కింపు

ఆత్మకూరు,అక్టోబర్‌ 16 (కోటకొండ హరికిరణ్-పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో పట్టణంలో రాజకీయ సందడి మొదలైంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా మున్సిపల్‌ కార్యాలయంలో ఐదు కౌంటర్లను ఏర్పాటు చేశారు. చైర్‌పర్సన్‌ పదవికి, వార్డు సభ్యుల నామినేషన్లకు విడివిడిగా కౌంటర్లు అందుబాటులో ఉంచినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ గంగా ప్రసాద్‌ తెలిపారు.అక్టోబర్‌ 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 19న నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహిస్తారు. అక్టోబర్‌ 28న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అవసరమైతే అక్టోబర్‌ 29న రీపోలింగ్‌ నిర్వహిస్తారు. 30న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో చైర్‌పర్సన్‌ పదవితో పాటు వార్డుల్లో పోటీ చేయనున్న అభ్యర్థులపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. రానున్న రోజుల్లో నామినేషన్ల దాఖలుతో ఆత్మకూరు మున్సిపల్‌ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *