Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

ఎల్‌బీనగర్‌లో యూజీడీ పనులకు నిధులు మంజూరు చేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎల్‌బీనగర్‌లో యూజీడీ పనులకు నిధులు మంజూరు చేయాలి

హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఈడీ పంకజను కోరిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
ఎల్‌బీనగర్: నియోజకవర్గంలోని వివిధ కాలనీలలో పెండింగ్‌లో ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులకు పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ మల్కాజిగిరి ఈడీ పంకజను కలిసి కాలనీల వారీగా పనుల వివరాలతో కూడిన నివేదికను అందజేశారు.
బైరామల్‌గూడలోని గోకుల్ ఎన్‌క్లేవ్, హయత్‌నగర్ పరిధిలోని సిరిహిల్స్, గాయత్రి నగర్, దత్తాత్రేయ నగర్, బెల్లయాదవ్ నగర్, సాయిరాం నగర్, శ్రీ వినాయక నగర్, శ్రీ వెంకటేశ్వర నగర్ కాలనీలతో పాటు హస్తినాపురం, మన్సూరాబాద్, బి.ఎన్.రెడ్డినగర్, చైతన్యపురి, వనస్థలిపురం, కొత్తపేట, నాగోల్, గడ్డిఅన్నారం డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో నూతన, పెండింగ్ డ్రైనేజీ పనులను మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఈడీ పంకజ స్పందిస్తూ, ఎమ్మెల్యే అందించిన నివేదిక ఆధారంగా కొన్ని పనులకు ఇప్పటికే అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రధాన సమస్యలు ఉన్న కాలనీలలో డ్రైనేజీ పనులు పూర్తి చేయడంతో పాటు, మిగిలిన పెండింగ్ పనులను కూడా సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఎల్‌బీనగర్‌లో యూజీడీ పనులకు నిధులు మంజూరు చేయాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *