Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

గొల్లపూడి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అబ్దుల్ కలాం నివాళులర్పించారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గొల్లపూడి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అబ్దుల్ కలాం నివాళులర్పించారు

*భారతరత్న అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం*

*యువతలో కలలు కనాలనే తపనను, దేశం కోసం పనిచేయాలనే సంకల్పాన్ని నింపిన మహనీయుడు*

*కలాం జయంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమా*

ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి (అక్టోబర్ 15):
భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాల సరసన నిలిపిన గొప్ప దార్శనికుడు, భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు కొనియాడారు. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆ మహనీయుని దేశసేవలను స్మరించుకుంటూ గొల్లపూడిలోని కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన చత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షిపణి శాస్త్రవేత్తగా దేశ రక్షణ రంగానికి విశేష సేవలందించి, భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి కలాం అని పేర్కొన్నారు. శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు సాధించడంతో పాటు, భారత రాష్ట్రపతిగా ప్రజలకు చేరువై ‘ప్రజల రాష్ట్రపతి’గా విశేష గుర్తింపు పొందారని తెలిపారు. కలలు కనడమే కాదు.. వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలని యువతకు సందేశమిచ్చిన మహనీయుడు అబ్దుల్ కలాం. విద్య, విజ్ఞానం, క్రమశిక్షణ, దేశభక్తి, నిస్వార్థ సేవ పట్ల ఆయన చూపిన నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఉమా పేర్కొన్నారు.

యువతే దేశ భవిష్యత్తు అని బలంగా విశ్వసించిన కలాం, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు నేటి తరానికి దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు. అబ్దుల్ కలాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్య, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక సేవ రంగాల్లో యువత ముందుకు సాగాలని, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆ మహనీయుని జీవితం, సేవలు, స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

గొల్లపూడి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అబ్దుల్ కలాం నివాళులర్పించారు

గొల్లపూడి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అబ్దుల్ కలాం నివాళులర్పించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *