Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

బడా గణేష్, బోనాల బందోబస్తు సేవలకు పెల్లూరు పెంటన్నకు అవార్డు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బడా గణేష్, బోనాల బందోబస్తు సేవలకు పెల్లూరు పెంటన్నకు అవార్డు

ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాలు, బోనాల పండుగ సందర్భంగా బందోబస్తు విధుల్లో విశేష సేవలందించిన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి గ్రామానికి చెందిన పెల్లూరు పెంటన్న (శ్రీకాంత్) అవార్డుతో పాటు ప్రశంసాపత్రం అందుకున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయంలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న పెంటన్న, ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ విభాగానికి అనుబంధంగా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) ద్వారా బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.
ఆయన సేవలను గుర్తించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎస్‌సీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహమ్మద్ నజాముద్దీన్ పాల్గొన్నారు.
ముమ్మళ్లపల్లి గ్రామానికి చెందిన పెల్లూరు పెద్ద రాములు కుమారుడైన పెంటన్న విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచి అవార్డు అందుకోవడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.

బడా గణేష్, బోనాల బందోబస్తు సేవలకు పెల్లూరు పెంటన్నకు అవార్డు

బడా గణేష్, బోనాల బందోబస్తు సేవలకు పెల్లూరు పెంటన్నకు అవార్డు

బడా గణేష్, బోనాల బందోబస్తు సేవలకు పెల్లూరు పెంటన్నకు అవార్డు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *