వార్త ముఖ్యాంశాలు
- అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మిట్టల్ పోర్టు ఏర్పాటుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు హాజరయ్యేందుకు వెళుతున్న సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
- అరెస్టయిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.
- కోటేశ్వరరావు, గనిశెట్టి సత్యనారాయణ ఉన్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మిట్టల్ పోర్టు ఏర్పాటుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు హాజరయ్యేందుకు వెళుతున్న సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు, గనిశెట్టి సత్యనారాయణ ఉన్నారు. రైతు సంఘం నాయకులు ఎం. అప్పలరాజు, ఎం. సత్యనారాయణ, ఎం. రాజేష్, ఎం. మహేష్బాబులను గృహనిర్బంధంలో ఉంచినట్లు సమాచారం. పోలీసుల చర్యలను సీపీఎం నేత కె. గోవిందరావు ఖండించారు. ప్రజాభిప్రాయ సేకరణకు హాజరయ్యే నాయకులను అడ్డుకోవడం అప్రజాస్వామికమని, అరెస్టులతో ప్రజల గొంతును అణచివేయలేరని ఆయన విమర్శించారు.