Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

ఆంధ్రప్రదేశ్‌లో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల సమరం.. షెడ్యూల్ విడుదల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆంధ్రప్రదేశ్‌లో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల సమరం.. షెడ్యూల్ విడుదల

వార్త ముఖ్యాంశాలు

  • కనిగిరి, అక్టోబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలైంది.
  • ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సందడి నెలకొంది.
  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి పెరుగుతోంది.

కనిగిరి, అక్టోబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలైంది. ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సందడి నెలకొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి పెరుగుతోంది.

మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు. మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో 10 నగర పంచాయతీలు, 77 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి.

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

* అక్టోబర్ 16 నుంచి 18 వరకు: నామినేషన్ల స్వీకరణ
* అక్టోబర్ 21: నామినేషన్ల ఉపసంహరణ
* అక్టోబర్ 26: ఎన్నికల ప్రచారం ముగింపు
* అక్టోబర్ 28: పోలింగ్
* అక్టోబర్ 30: ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

* అక్టోబర్ 19: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
* అక్టోబర్ 21 నుంచి 23 వరకు: నామినేషన్ల దాఖలు
* అక్టోబర్ 27: నామినేషన్ల ఉపసంహరణ
* నవంబర్ 3: పోలింగ్
* నవంబర్ 4: రీపోలింగ్
* నవంబర్ 5: ఓట్ల లెక్కింపు, ఫలితాలు

మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

తొలి దశ

* నవంబర్ 13: నోటిఫికేషన్ విడుదల
* నవంబర్ 26: పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి

రెండో దశ

* నవంబర్ 16: నోటిఫికేషన్ విడుదల
* నవంబర్ 29: పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

మూడో దశ

* నవంబర్ 19: నోటిఫికేషన్ విడుదల
* డిసెంబర్ 2: పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి

— PUNNAMI NEWS

Leave a comment

Your email address will not be published. Required fields are marked *