Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వాకర్స్‌ కోసం బైపాస్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వాకర్స్‌ కోసం బైపాస్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు!

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు (కోటకొండ హరికిరణ్‌ – పున్నమి ప్రతినిధి):ఆత్మకూరులో నూతనంగా ప్రారంభించిన వాయుపుత్ర బైపాస్‌ రోడ్డుపై వాకర్స్‌ భద్రతకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
  • ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌ చేసేవారికి వాహనాల రాకపోకలతో ఇబ్బందులు, ప్రమాదాల ముప్పు లేకుండా నిర్దిష్ట సమయాల్లో ట్రాఫిక్‌ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు.
  • వాకర్స్‌ విజ్ఞప్తి మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టినట్లు సీఐ గంగాధర్‌ తెలిపారు.బైపాస్‌ రోడ్డుపై వాకింగ్‌ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను స్థానిక వాకర్స్‌ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఉదయం 6–8, సాయంత్రం 4:30–6 గంటల వరకు ఒకవైపు వాహనాల రాకపోకలు బంద్‌

వాకర్స్‌ అభిప్రాయాలతోనే సమయ నిర్ణయం.. సీఐ గంగాధర్‌

ఆత్మకూరు (కోటకొండ హరికిరణ్‌ – పున్నమి ప్రతినిధి):ఆత్మకూరులో నూతనంగా ప్రారంభించిన వాయుపుత్ర బైపాస్‌ రోడ్డుపై వాకర్స్‌ భద్రతకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌ చేసేవారికి వాహనాల రాకపోకలతో ఇబ్బందులు, ప్రమాదాల ముప్పు లేకుండా నిర్దిష్ట సమయాల్లో ట్రాఫిక్‌ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. వాకర్స్‌ విజ్ఞప్తి మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టినట్లు సీఐ గంగాధర్‌ తెలిపారు.బైపాస్‌ రోడ్డుపై వాకింగ్‌ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను స్థానిక వాకర్స్‌ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి ఆదేశాలతో సీఐ గంగాధర్‌, ఎస్‌ఐ జంపానీ కుమార్‌ సిబ్బందితో కలిసి వాకర్స్‌తో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం వారి సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌ సమయాలను నిర్దేశించారు.

రోజూ నాలుగు గంటలు ప్రత్యేక సమయం

నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు బైపాస్‌ రోడ్డులో ఒకవైపు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. మిగిలిన సమయాల్లో వాహనాల ప్రయాణానికి అనుమతి ఉంటుంది. ఈ మేరకు రోడ్డుపై బోర్డులు ఏర్పాటు చేసి, వాకింగ్‌ సమయాలను తెలియజేసే ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు.వాకర్స్‌ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే ట్రాఫిక్‌ నిర్వహణ సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులు నిర్దేశిత సమయాలను గమనించి, నిబంధనలను పాటించాలని సీఐ గంగాధర్‌ సూచించారు. వాకింగ్‌ చేసేవారికి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని కోరారు.బైపాస్‌ రోడ్డును ప్రజలు సురక్షితంగా వినియోగించుకునేందుకు పోలీసుల సూచనలను పాటించాలని, వాకర్స్‌, వాహనదారులు పరస్పర సహకారంతో వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *