Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

షకీలా పై కొండంత ఆశతో వైసీపీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
షకీలా పై కొండంత ఆశతో వైసీపీ

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, అక్టోబర్ 14 (కోటకొండ హరికిరణ్‌ - పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపల్‌ చైర్మన్‌ పీఠానికి జనరల్‌ మహిళ రిజర్వేషన్‌ ఖరారు కావడంతో పట్టణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
  • తదుపరి చైర్మన్‌ అభ్యర్థి ఎవరనే చర్చ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో జోరుగా సాగుతోంది.
  • పలువురు ఆశావహుల పేర్లు వినిపిస్తున్నా, పార్టీ నిర్ణయం ఇంకా వెలువడలేదు.వైసీపీ వర్గాల్లో డాక్టర్‌ బొమ్మిరెడ్డి షకీలా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

చైర్మన్‌ పీఠంపై జనరల్‌ మహిళ రిజర్వేషన్‌తో రాజకీయ వేడి


బొమ్మిరెడ్డి షకీలా వైపు పార్టీ ఆశలు.. అభ్యర్థిత్వంపై ఇంకా వీడని సందిగ్ధత

ఆత్మకూరు, అక్టోబర్ 14 (కోటకొండ హరికిరణ్‌ – పున్నమి ప్రతినిధి):

ఆత్మకూరు మున్సిపల్‌ చైర్మన్‌ పీఠానికి జనరల్‌ మహిళ రిజర్వేషన్‌ ఖరారు కావడంతో పట్టణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. తదుపరి చైర్మన్‌ అభ్యర్థి ఎవరనే చర్చ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో జోరుగా సాగుతోంది. పలువురు ఆశావహుల పేర్లు వినిపిస్తున్నా, పార్టీ నిర్ణయం ఇంకా వెలువడలేదు.వైసీపీ వర్గాల్లో డాక్టర్‌ బొమ్మిరెడ్డి షకీలా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి తో పాటు బొమ్మిరెడ్డి కుటుంబానికి ఉన్న రాజకీయ, సామాజిక పరిచయాలు ఆమెకు అనుకూలంగా మారవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రముఖ గైనకాలజిస్ట్‌గా ప్రజలకు చేరువగా ఉండటం, కుటుంబానికి ఉన్న స్థానిక అనుబంధం కూడా సానుకూల అంశాలుగా పేర్కొంటున్నారు. అయితే, ఆమె అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

— అభ్యర్థిత్వంపై కొనసాగుతున్న సందిగ్ధత

రిజర్వేషన్‌ మహిళా నాయకులకు అవకాశం కల్పించినప్పటికీ, గెలుపు అవకాశాలు, వార్డుల్లో పార్టీ బలాబలాలు, స్థానిక నాయకుల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు అభ్యర్థి ఎంపికలో కీలకంగా మారనున్నాయి. అందువల్ల ప్రచారంలో ఉన్న పేరు ఖరారైనట్టుగా భావించలేమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.డాక్టర్‌ షకీలా పోటీకి అంగీకరిస్తారా? పార్టీ నాయకత్వం ఆమె పేరును అధికారికంగా ప్రతిపాదిస్తుందా? లేక మరో మహిళా నేతకు అవకాశం ఇస్తుందా? అనే ప్రశ్నలు వైసీపీ శ్రేణుల్లో కొనసాగుతున్నాయి. 28 వార్డుల్లో పార్టీ బలాన్ని పెంచుకోవడం, స్థానిక నాయకులను సమన్వయం చేయడం, ప్రజల మద్దతు కూడగట్టడం కూడా పార్టీకి కీలకం కానుంది.ప్రస్తుతం షకీలా పేరు చుట్టూ చర్చలు సాగుతున్నా, తుది నిర్ణయం స్పష్టంగా లేదు. ఆమె అభ్యర్థిత్వం ఖరారవుతుందా, లేక వైసీపీ మరో మహిళా అభ్యర్థిని ఎంపిక చేస్తుందా అన్నది అధికారిక ప్రకటనతోనే తేలనుంది. అప్పటివరకు ఆత్మకూరు మున్సిపల్‌ చైర్మన్‌ పీఠంపై ఉత్కంఠ కొనసాగనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *