వార్త ముఖ్యాంశాలు
- -35 స్థానాలకు గెజిట్ విడుదల..
- మహిళలకు 17 స్థానాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 35 మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
- జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అక్టోబర్ 13న గెజిట్ నంబర్ 101/2026 ద్వారా నోటిఫికేషన్ జారీ చేశారు.
-35 స్థానాలకు గెజిట్ విడుదల.. మహిళలకు 17 స్థానాలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 35 మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అక్టోబర్ 13న గెజిట్ నంబర్ 101/2026 ద్వారా నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994, అక్టోబర్ 12న జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 154 ప్రకారం ఈ రిజర్వేషన్లను నిర్ణయించారు. మొత్తం స్థానాల్లో ఎస్టీలకు నాలుగు, ఎస్సీలకు ఎనిమిది, బీసీలకు ఐదు కేటాయించగా, మరో 18 స్థానాలను అన్రిజర్వ్డ్గా పేర్కొన్నారు. అన్ని వర్గాలు కలిపి మహిళలకు 17 స్థానాలు కేటాయించారు.
ఎస్టీ జనరల్ కింద కొడవలూరు, కోవూరు; ఎస్టీ మహిళలకు నెల్లూరు రూరల్, కోట మండలాలను కేటాయించారు. ఎస్సీ జనరల్ కింద సైదాపురం, కొండాపురం, చిల్లకూరు, అనంతసాగరం; ఎస్సీ మహిళలకు బుచ్చిరెడ్డిపాలెం, తోటపల్లిగూడూరు, ఆత్మకూరు, రాపూరు స్థానాలు కేటాయించారు. బీసీ జనరల్ కింద విడవలూరు, కావలి, ఉదయగిరి; బీసీ మహిళలకు సంగం, ఇందుకూరుపేట మండలాలను కేటాయించారు.
అన్రిజర్వ్డ్ జనరల్ కింద వెంకటాచలం, సీతారామపురం, కలిగిరి, కలువాయి, వరికుంటపాడు, అనుమసముద్రంపేట, చేజర్ల, ముత్తుకూరు, వింజమూరు మండలాలను పేర్కొన్నారు. అన్రిజర్వ్డ్ మహిళలకు మనుబోలు, బోగోలు, గూడూరు, పొదలకూరు, జలదంకి, దగదర్తి, అల్లూరు, దుత్తలూరు, మర్రిపాడు మండలాలను కేటాయించారు.