వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండల సన్నాహక సమావేశం నిర్వహించారు.నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే *దొంతి మాధవ రెడ్డి గారి* ఆదేశానుసారం, *పబ్బతి సతీష్ రెడ్డి* గారి సూచన మేరకుఖానాపురం మండల పార్టీ అధ్యక్షులు మరియు నర్సంపేట AMC వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు* మరియు *పి.ఎ.సి.ఎస్ చైర్మన్ మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వల్లె శ్రీనివాస్ యాదవ్ గారి*ఆధ్వర్యంలో ఖానాపురం మండలం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్ గా!
*బుదురావుపేట గ్రామనికి చెందిన,కోడి మల్లేష్ యాదవ్ గారినినియమించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ
మోడం ఎల్ల గౌడ్, సర్పంచ్ లు జాటోతు వినోద్ కుమార్, పిండి అనూష- కుమార్, పెసరు రాణి-గోవర్ధన్ రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు సొసైటీ డైరెక్టర్ లింగిడి వెంకటేశ్వర్లు, అశోక్ నగర్ ఇన్చార్జి గట్టి సారంగపాణి ఖానాపూర్ఇన్చార్జి చలిగంటి మల్లికార్జున్, గ్రామ పార్టీ అధ్యక్షులు నవీన్, మోహన్ నాయక్, సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పట్టభద్రుల ఓట్ల నమోదును వేగవంతం చేయాలని, ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని నిర్ణయించారు.
