Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

గొల్లలపాలెంలో పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గొల్లలపాలెంలో పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • గొల్లలపాలెంలో పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థులకు అవగాహన కల్పించిన కొత్తవలస ఇన్‌స్పెక్టర్ విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, అక్టోబర్ 13.
  • ( పున్నమి ప్రతినిధి ) విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసుల ఆధ్వర్యంలో గొల్లలపాలెం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు.
  • రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించారు.

గొల్లలపాలెంలో పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థులకు అవగాహన కల్పించిన కొత్తవలస ఇన్‌స్పెక్టర్

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, అక్టోబర్ 13. ( పున్నమి ప్రతినిధి )

విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసుల ఆధ్వర్యంలో గొల్లలపాలెం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో గ్రామంలో శాంతిభద్రతలను కాపాడుకోవాలని, గ్రామస్థులంతా పరస్పర సహకారంతో శాంతి, సామరస్యాలను పాటించాలని పోలీసులు సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, ఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగిస్తూ, ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కొత్తవలస పోలీస్ ఇన్‌స్పెక్టర్ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *