Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇళ్ల నిర్మాణాలకు మట్టి తోలుకోవడానికి అనుమతి ఇవ్వాలి: సిపిఎం డిమాండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇళ్ల నిర్మాణాలకు మట్టి తోలుకోవడానికి అనుమతి ఇవ్వాలి: సిపిఎం డిమాండ్

అనంతసాగరం అక్టోబర్ 13,పున్నమి ప్రతినిధి:

అనంతసాగరం మరియు మంచాలపల్లి గ్రామాలలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన పేద ప్రజలకు బేస్‌మెంట్లు నింపుకోవడానికి మట్టి దొరకక నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయని, వెంటనే మట్టి తోలుకోవడానికి అనుమతులు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గృహ నిర్మాణ లబ్ధిదారులు మంగళవారం అనంతసాగరం మండల తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ
గ్రామాలలో ఇళ్ల నిర్మాణాలు సగం వరకు వచ్చి బేస్‌మెంట్లు నింపడానికి మట్టి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిర్మాణాలు ఆగిపోవడం వల్ల లబ్ధిదారులు ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం మరియు అధికారులు తక్షణమే స్పందించి, పేదల ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన మట్టిని తోలుకోవడానికి నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేయాలని కోరారు. పెన్న నది నుండి ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద పెద్ద టిప్పర్ల ద్వారా ఇసుక ఇతర రాష్ట్రాలకు తోలుతుంటే పట్టించుకొని మైనింగ్, ఇరిగేషన్ శాఖ వారు ఇళ్లకు, పొలాల కు మట్టి తోలుకుంటే ట్రాక్టర్ లను పట్టుకోవడం విడురంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫయాజ్, ఖాజా మొహిద్దీన్, సలీమ్, పోలయ్య,మస్తాన్, సయ్యద్ మరియు ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణాలకు మట్టి తోలుకోవడానికి అనుమతి ఇవ్వాలి: సిపిఎం డిమాండ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *