Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

సముద్రాలలో అంతులేని వీధి కుక్కల బీభత్సం.. గొర్రెలు, బర్రెలు పోయిన చోటే.. నేడు 50 నాటుకోళ్లు బలి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సముద్రాలలో అంతులేని వీధి కుక్కల బీభత్సం.. గొర్రెలు, బర్రెలు పోయిన చోటే.. నేడు 50 నాటుకోళ్లు బలి!

వార్త ముఖ్యాంశాలు

  • సముద్రాలలో అంతులేని వీధి కుక్కల బీభత్సం..
  • గొర్రెలు, బర్రెలు పోయిన చోటే..
  • నేడు 50 నాటుకోళ్లు బలి!

సముద్రాలలో అంతులేని వీధి కుక్కల బీభత్సం.. గొర్రెలు, బర్రెలు పోయిన చోటే.. నేడు 50 నాటుకోళ్లు బలి!
​వార్తా కథనం:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో వీధి కుక్కలు గ్రామస్థులను, పశుపోషకులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. గ్రామంలో కొద్దిరోజులుగా వీధి కుక్కల సంచారం అడ్డూఅదుపు లేకుండా పోయింది. గతంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో పలువురు రైతులకు చెందిన బర్రెలు, దూడలు, గొర్రెలు ఈ కుక్కల దాడిలో మృతి చెందగా… తాజాగా మంగళవారం ఉదయం రైతు పెద్దరబోయిన రాజు వ్యవసాయ బావి వద్ద పెంచుకుంటున్న సుమారు 50 నాటుకోళ్లు కుక్కల దాడిలో అశువుబాశాయి.
​ఒకరి తర్వాత ఒకరుగా రైతులు తమ మూగజీవాలను కోల్పోతున్నప్పటికీ, అధికారుల నుండి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. పశువుల పాకలు, బావుల వద్ద కాపలా కరువై వీధి కుక్కలు గుంపులుగా దాడి చేస్తుండటంతో తమకు తీవ్రమైన ఆర్థిక నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, పంచాయతీ అధికారులు స్పందించి వీధి కుక్కల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని సముద్రాల గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *