వార్త ముఖ్యాంశాలు
- భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గ కార్యాలయంలో వరంగల్–ఖమ్మం–నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు.
- ఈ సమావేశానికి ఎమ్మెల్సీ వరంగల్ జిల్లా కన్వీనర్ రత్నం సతీష్ షా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు ప్రక్రియ అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గ కార్యాలయంలో వరంగల్–ఖమ్మం–నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ వరంగల్ జిల్లా కన్వీనర్ రత్నం సతీష్ షా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు ప్రక్రియ అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను విద్యావేత్తలకు వివరించి, ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్తల చూపు బీజేపీ వైపు ఉంటుందని, కమలం జెండా ఎగరాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యావేత్తలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేలా చైతన్యం కల్పించాలని అన్నారు.
ఎమ్మెల్సీ ఓటరు నమోదు నిబంధనలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన ఓటర్లందరికీ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని నాయకులు నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్సీ కన్వీనర్ రేసు శ్రీనివాస్, కో-కన్వీనర్ కట్ల రాంచేందర్ రెడ్డి, వడ్డేపల్లి నరసింహ రాములు, నర్సంపేట పట్టణ కన్వీనర్ జూలూరి మనీష్ గౌడ్, సీనియర్ నాయకులు అబోతు రాజు యాదవ్, గడ్డం ఆంజనేయులు, కూనమళ్ళ పృథ్వీరాజ్, మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు యాదవ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు బానోత్ రమేష్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఖలీల్ పాషా, నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, ఖానాపూర్ మండల అధ్యక్షులు రాదారపు అశోక్ నల్లబెల్లి మండలం అధ్యక్షులు తడక వినయ్ గౌడ్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, దుగ్గొండి మండల అధ్యక్షుడు నేదుర రాజేందర్, చెన్నరావుపేట మండలాధ్యక్షులు దామరుప్పల శేఖర్, జిల్లా నాయకులు మండల నాయకులు పట్టణ నాయకులు, సీనియర్ నాయకులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.