Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావుకు ఘన సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావుకు ఘన సన్మానం

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన వెంకట్రావు బదిలీపై నెల్లూరులోని బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంతో సోమవారం ఆయనకు ఘనంగా వీడ్కోలు సన్మానం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
  • విధి నిర్వహణలో వెంకట్రావు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఉదయగిరి: స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన వెంకట్రావు బదిలీపై నెల్లూరులోని బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంతో సోమవారం ఆయనకు ఘనంగా వీడ్కోలు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో వెంకట్రావు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. పోలీస్ శాఖలో ఆయన చూపిన అంకితభావం, బాధ్యతాయుతమైన పనితీరును కొనియాడారు. నూతన బాధ్యతల్లోనూ మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు సుభాషిణి, శ్రీనివాసులు, శీను, అశోక్, ప్రశాంత్, ఫైరోజా, మాధవి, కోటేశ్వరమ్మతో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొని వెంకట్రావుకు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *