Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో జనసేన ఎన్నికల సమన్వయ కమిటీ ఏర్పాటు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరిలో జనసేన ఎన్నికల సమన్వయ కమిటీ ఏర్పాటు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.
  • ఈ కమిటీ సమన్వయకర్తలుగా కాశీరావు బోగినేని, గుండబత్తిన రామమూర్తి, నిమ్మలపల్లి రామ చైతన్యలను నియమించింది.
  • ఎన్నికల సన్నాహాల్లో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, స్థానిక సమస్యలు, ప్రజాభిప్రాయాలను తెలుసుకునేందుకు 32 మందితో నిర్వాహక దళాన్ని ఏర్పాటు చేసింది.

ఉదయగిరి: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమన్వయకర్తలుగా కాశీరావు బోగినేని, గుండబత్తిన రామమూర్తి, నిమ్మలపల్లి రామ చైతన్యలను నియమించింది. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, స్థానిక సమస్యలు, ప్రజాభిప్రాయాలను తెలుసుకునేందుకు 32 మందితో నిర్వాహక దళాన్ని ఏర్పాటు చేసింది. అలాగే సమన్వయ కార్యక్రమాలకు తోడ్పాటునందించేందుకు ఐదుగురితో సహాయక బృందాన్ని నియమించినట్లు పార్టీ ప్రకటించింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, క్షేత్రస్థాయిలో సమాచార సేకరణను బలోపేతం చేయడం ఈ కమిటీల ప్రధాన లక్ష్యంగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *