Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు ఏసీ కాలనీలో అర్ధరాత్రి చోరీ..! పది సవర్ల బంగారం, 40 తులాల వెండి, రూ.40 వేల నగదు అపహరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరు ఏసీ కాలనీలో అర్ధరాత్రి చోరీ..! పది సవర్ల బంగారం, 40 తులాల వెండి, రూ.40 వేల నగదు అపహరణ

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు: మండలంలోని ఏసీ కాలనీలో అర్ధరాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది.
  • షేక్ మీరావలి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు విలువైన ఆభరణాలు, నగదును అపహరించుకెళ్లారు.
  • ఇంట్లో ఉన్న పది సవర్ల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి వస్తువులతో పాటు రూ.40 వేల నగదును దొంగిలించినట్లు సమాచారం.

దుత్తలూరు: మండలంలోని ఏసీ కాలనీలో అర్ధరాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. షేక్ మీరావలి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు విలువైన ఆభరణాలు, నగదును అపహరించుకెళ్లారు. ఇంట్లో ఉన్న పది సవర్ల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి వస్తువులతో పాటు రూ.40 వేల నగదును దొంగిలించినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చోరీ ఘటనతో కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు మీరావలికి భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు స్పందించి దర్యాప్తు చేపట్టి, దొంగలను గుర్తించి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *