Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పెద్దపల్లి

మంత్రి శ్రీధర్ బాబుకు పెద్దపల్లి జిల్లా పూసల సంఘం నాయకుల ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మంత్రి శ్రీధర్ బాబుకు పెద్దపల్లి జిల్లా పూసల సంఘం నాయకుల ఆహ్వానం

వార్త ముఖ్యాంశాలు

  • పెద్దపల్లి / హైదరాబాద్, అక్టోబర్ 11: పెద్దపల్లి జిల్లా పూసల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరుకావాల్సిందిగా రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును ఆ సంఘం నాయకులు కోరారు.
  • ఆదివారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును పూసల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పాగుచ్ఛం అందజేశారు.
  • ఈనెల 25వ తేదీన పెద్దపల్లిలోని పూసల సంఘం భవనంలో ఘనంగా నిర్వహించనున్న నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేసి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు.

పెద్దపల్లి / హైదరాబాద్, అక్టోబర్ 11:

పెద్దపల్లి జిల్లా పూసల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరుకావాల్సిందిగా రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును ఆ సంఘం నాయకులు కోరారు. ఆదివారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును పూసల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పాగుచ్ఛం అందజేశారు. ఈనెల 25వ తేదీన పెద్దపల్లిలోని పూసల సంఘం భవనంలో ఘనంగా నిర్వహించనున్న నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేసి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుడ్ల సమ్మయ్య, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పొదిల కుమారస్వామి, ఉపాధ్యక్షులు పట్టెం నరసయ్య, నాగిశెట్టి శ్రీనివాస్, కోనేటి శ్రీనివాస్, పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *