వార్త ముఖ్యాంశాలు
- మంగళగిరి: తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యూనిట్ ఇన్చార్జీలు కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె.
- చౌదరి అన్నారు.
- మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న 20వ బ్యాచ్ యూనిట్ ఇన్చార్జీల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, “యూనిట్ ఇన్చార్జీల విధులు మరియు బాధ్యతలు” అనే అంశంపై శిక్షణ అందించారు.ఈ సందర్భంగా యూనిట్ ఇన్చార్జీలు పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు.
మంగళగిరి: తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యూనిట్ ఇన్చార్జీలు కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె. చౌదరి అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న 20వ బ్యాచ్ యూనిట్ ఇన్చార్జీల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, “యూనిట్ ఇన్చార్జీల విధులు మరియు బాధ్యతలు” అనే అంశంపై శిక్షణ అందించారు.ఈ సందర్భంగా యూనిట్ ఇన్చార్జీలు పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో చురుకుగా వ్యవహరించాలని సూచించారు.పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం, కార్యకర్తలతో సమన్వయం చేసుకోవడం, ప్రజలకు అందుబాటులో ఉండటం, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వంటి అంశాలపై యూనిట్ ఇన్‌చార్జీలకు అవగాహన కల్పించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని వివరించారు.
మంగళగిరి టీడీపీ జాతీయ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాలు పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంస్థాగత విధానాలు, బాధ్యతలపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడుతున్నాయి. ఈ కార్యక్రమంలో 20వ బ్యాచ్‌కు చెందిన యూనిట్ ఇన్చార్జీలు పాల్గొన్నారు.