Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

సముద్రాలలో ఘనంగా బతుకమ్మ ఏర్పాట్లు – ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేసిన పంచాయతీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సముద్రాలలో ఘనంగా బతుకమ్మ ఏర్పాట్లు – ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేసిన పంచాయతీ

వార్త ముఖ్యాంశాలు

  • జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు.
  • సర్పంచ్ బత్తుల యాదగిరి మరియు పంచాయతీ సెక్రెటరీ సోమేష్‌ల ప్రత్యేక చొరవతో గ్రామంలోని బతుకమ్మ వేడుకల ప్రాంగణంలో నూతన విద్యుత్ దీపాలను (లైట్లు) ఏర్పాటు చేశారు.
  • ​పండుగ వేళ మహిళలకు రాత్రి సమయాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, చీకటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా ఈ లైటింగ్ ఏర్పాట్లు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు. సర్పంచ్ బత్తుల యాదగిరి మరియు పంచాయతీ సెక్రెటరీ సోమేష్‌ల ప్రత్యేక చొరవతో గ్రామంలోని బతుకమ్మ వేడుకల ప్రాంగణంలో నూతన విద్యుత్ దీపాలను (లైట్లు) ఏర్పాటు చేశారు.
​పండుగ వేళ మహిళలకు రాత్రి సమయాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, చీకటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా ఈ లైటింగ్ ఏర్పాట్లు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ బత్తుల యాదగిరి, పంచాయతీ సెక్రెటరీ సోమేష్ మాట్లాడుతూ.. గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు ప్రశాంతంగా మరియు ఆనందంగా జరిగేలా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *