Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

మీసేవ, ఏపీ సేవ పోర్టళ్లలో నిలిపివేసిన సేవలను వెంటనే పునరుద్ధరించాలి మంత్రి ఫరూక్‌కు ’ వినతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మీసేవ, ఏపీ సేవ పోర్టళ్లలో నిలిపివేసిన సేవలను వెంటనే పునరుద్ధరించాలి మంత్రి ఫరూక్‌కు ’ వినతి

వార్త ముఖ్యాంశాలు

  • మీసేవ, ఏపీ సేవ పోర్టళ్లలో నిలిపివేసిన ప్రజా సేవలను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ ‘మీసేవ నిర్వాహకుల సమైక్య సంక్షేమ సంఘం’ ప్రతినిధులు నంద్యాలలోని మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ కు, నంద్యాల టిడిపి జిల్లా…
  • ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరైన సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్‌ఫోన్లు లేని ప్రజలు అపరిచిత ఆన్‌లైన్ లింకుల బారినపడి సైబర్ మోసాలకు గురవుతున్నారని తెలిపారు.
  • మరోవైపు రీ-ఇష్యూ సేవలు నిలిచిపోవడంతో ప్రధాన ఆదాయం కోల్పోయి, మీసేవ కేంద్రాలనే నమ్ముకున్న వేలాది నిర్వాహకుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మీసేవ, ఏపీ సేవ పోర్టళ్లలో నిలిపివేసిన ప్రజా సేవలను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ ‘మీసేవ నిర్వాహకుల సమైక్య సంక్షేమ సంఘం’ ప్రతినిధులు నంద్యాలలోని మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ కు, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ మీసేవ, ఏపీ సేవ పోర్టళ్లలో కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాల రీ-ఇష్యూ, పట్టాదార్ పాస్‌బుక్ రీప్రింట్, వాటర్ టాక్స్ చెల్లింపులు మరియు సీడీఎంఏ పరిధిలోని జనన, మరణ ధ్రువీకరణ పత్రాల సేవలను నిలిపివేయడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరైన సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్‌ఫోన్లు లేని ప్రజలు అపరిచిత ఆన్‌లైన్ లింకుల బారినపడి సైబర్ మోసాలకు గురవుతున్నారని తెలిపారు. మరోవైపు రీ-ఇష్యూ సేవలు నిలిచిపోవడంతో ప్రధాన ఆదాయం కోల్పోయి, మీసేవ కేంద్రాలనే నమ్ముకున్న వేలాది నిర్వాహకుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతతో పాటు నిర్వాహకుల ఉపాధిని పరిగణనలోకి తీసుకుని, “మన మిత్ర”తో సమానంగా మీసేవ, ఏపీ సేవ పోర్టళ్లలోనూ నిలిపివేసిన అన్ని సేవలను వెంటనే పునరుద్ధరించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి ఫరూక్ ని కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ సానుకూల అందిస్తూ మీసేవ కేంద్రాల ద్వారా సామాన్య ప్రజలకు అందుతున్న సేవల ప్రాధాన్యతను, అలాగే నిర్వాహకుల ఉపాధి సమస్యను తాను అర్థం చేసుకున్నానని తెలిపారు. ప్రజలకు సైబర్ మోసాల బారిన పడకుండా రక్షణ కల్పించడంతో పాటు, వేలాది మీసేవ కుటుంబాల జీవనోపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ అంశాన్ని తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ గార్ల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మీసేవ నిర్వాహకుల సమైక్య సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సన భాషా, జిల్లా కోఆర్డినేటర్ గడ్డం అమర్నాథ్, ప్రతినిధులు గోస్పాడు మనోహర్, భారత్ మునాఫ్, పొన్నాపురం కాలనీ మహబూబ్, రాజు, హకీం, బాబు, సుధాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *