వార్త ముఖ్యాంశాలు
- నంద్యాల ఎస్‌వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, నంద్యాలలో నిర్వహించిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవం–2026 పోటీల్లో నంద్యాల క్రాంతినగర్ లోని శ్రీ శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి మూడు బహుమతులు సాధించారు.స్టేట్ బోర్డు, సీబీఎస్‌ఈ విభాగాలకు చెందిన విద్యార్థులు ఈ విజయాలు సాధించి పాఠశాలకు కీర్తి…
- సీబీఎస్‌ఈ విభాగానికి చెందిన ఐదో తరగతి విద్యార్థి హర్షవర్ధన్ డ్రాయింగ్ పోటీలో విజేతగా నిలిచాడు.
- ఎనిమిదో తరగతి సీబీఎస్‌ఈ విద్యార్థి మధుసాయి ఎక్స్‌టెంపోర్ స్పీచ్ పోటీలో బహుమతి సాధించాడు.
నంద్యాల ఎస్‌వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, నంద్యాలలో నిర్వహించిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవం–2026 పోటీల్లో నంద్యాల క్రాంతినగర్ లోని శ్రీ శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి మూడు బహుమతులు సాధించారు.స్టేట్ బోర్డు, సీబీఎస్‌ఈ విభాగాలకు చెందిన విద్యార్థులు ఈ విజయాలు సాధించి పాఠశాలకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చారు. సీబీఎస్‌ఈ విభాగానికి చెందిన ఐదో తరగతి విద్యార్థి హర్షవర్ధన్ డ్రాయింగ్ పోటీలో విజేతగా నిలిచాడు. ఎనిమిదో తరగతి సీబీఎస్‌ఈ విద్యార్థి మధుసాయి ఎక్స్‌టెంపోర్ స్పీచ్ పోటీలో బహుమతి సాధించాడు. అలాగే స్టేట్ బోర్డు విభాగానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి పూర్ణచంద్ర ఎక్స్‌టెంపోర్ స్పీచ్ పోటీలో విజేతగా నిలిచి పాఠశాల ప్రతిభను చాటాడు.విద్యార్థుల విజయాల పట్ల పాఠశాల కరస్పాండెంట్ రమ్య హర్షం వ్యక్తం చేసి, విజేతలను అభినందించారు. విద్యార్థులను పోటీలకు సిద్ధం చేయడంలో కృషి చేసిన సైన్స్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులను కూడా ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో దోహదపడతాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. భవిష్యత్తులోనూ విద్యార్థులు ఇలాంటి పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించింది.