వార్త ముఖ్యాంశాలు
- పల్నాడు : నరసరావుపేట పట్టణం రామిరెడ్డిపేట లోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో శుక్రవారం ముందస్తు దసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు.
- ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ వేషధారణలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పండుగ విశిష్టత ప్రతిబింబింపజేశాయి.ఈ సందర్బంగా స్కూల్ ప్రిన్సిపల్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ హిందువులు జరుపుకునే ప్రముఖ పండుగల్లో దసరా ఒకటని .ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు విజయ దశమి పండుగను జరుపుకుంటారని…
- చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని భావిస్తారని వివరించారు.
పల్నాడు : నరసరావుపేట పట్టణం రామిరెడ్డిపేట లోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో శుక్రవారం ముందస్తు దసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ వేషధారణలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పండుగ విశిష్టత ప్రతిబింబింపజేశాయి.ఈ సందర్బంగా స్కూల్ ప్రిన్సిపల్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ హిందువులు జరుపుకునే ప్రముఖ పండుగల్లో దసరా ఒకటని .ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు విజయ దశమి పండుగను జరుపుకుంటారని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని భావిస్తారని వివరించారు. నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ డీ హెడ్ లు స్వాతి లక్ష్మీ, మారియా పాట్రిక్, క్లస్టర్ ప్రిన్సిపల్ బెల్లంకొండ భాగ్యరాణి, జెడ్సీఓలు షేక్ గౌసియా, షేక్ రిహాని, వైస్ ప్రిన్సిపళ్లు సరోజిని, ధనలక్ష్మి, విద్యార్థినులు పాల్గొన్నారు.
