పుంగనూరు, అక్టోబర్ 09 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పలమనేరు శాసనసభ్యులు శ్రీ నూతనకాల్వ అమరనాథరెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీ వై. మధుసూదన్ నాయుడు సమక్షంలో నెక్కుంది పంచాయతీ పరిధిలోని పెద్ద అల్సాపురం, చిన్న అల్సాపురం గ్రామాలకు చెందిన పలువురు గ్రామస్థులు, వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ పుంగనూరులో టీడీపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

