Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

గౌరవ శాసనమండలి డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులను కలిసిన వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కమిటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గౌరవ శాసనమండలి డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులను కలిసిన వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కమిటీ

వార్త ముఖ్యాంశాలు

  • వరంగల్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా కమిటీకి నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు ఈరోజు హైదరాబాద్‌లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ​ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ వైస్ చైర్మన్ శానబోయిన రాజ్ కుమార్, స్టేట్ ఎంసీ మెంబర్ నాడెం శాంతి కుమార్, జిల్లా ఎంసీ సభ్యులు మోతే తిరుపతిరెడ్డి, చొప్పరి సోమయ్యలకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
  • ​అనంతరం రెడ్ క్రాస్ ప్రతినిధులు మాట్లాడుతూ..

వరంగల్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా కమిటీకి నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు ఈరోజు హైదరాబాద్‌లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు.
​ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ వైస్ చైర్మన్ శానబోయిన రాజ్ కుమార్, స్టేట్ ఎంసీ మెంబర్ నాడెం శాంతి కుమార్, జిల్లా ఎంసీ సభ్యులు మోతే తిరుపతిరెడ్డి, చొప్పరి సోమయ్యలకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
​అనంతరం రెడ్ క్రాస్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజాసేవే పరమావధిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *