వార్త ముఖ్యాంశాలు
- చిట్వేల్: మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టి, వాటిని కాపాడాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
- ప్రభుత్వ భూముల కబ్జాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరితే కేసులు పెడతామని బెదిరించడం సరికాదని పేర్కొన్నారు.
చిట్వేల్: మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టి, వాటిని కాపాడాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల కబ్జాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరితే కేసులు పెడతామని బెదిరించడం సరికాదని పేర్కొన్నారు. మైలపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 999/1లో 15 ఎకరాలు, 490/2లో ఎకరా 50 సెంట్లు, తమ్మాయిపాలెం పంచాయతీ సర్వే నంబరు 2లో ఎకరా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నట్లు మూడు నెలల క్రితం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసినట్లు సీపీఐ నాయకులు తెలిపారు. అయినప్పటికీ అధికారులు స్పందించలేదని విమర్శించారు. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం తగదని సీపీఐ రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, నాయకులు తిప్పన ప్రసాద్, సామ గంగయ్య అన్నారు. కేసులకు భయపడకుండా పేద ప్రజల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని కోరారు. స్పందించకుంటే భూ సమస్యలతో బాధపడుతున్న ప్రజలను కలుపుకొని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పల్లెపాటి పెంచలయ్య, పల్లెపాటి మస్తానమ్మ పాల్గొన్నారు.