Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

ఘనంగా ప్రపంచ తపాలా దినోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా ప్రపంచ తపాలా దినోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • ఘనంగా ప్రపంచ తపాలా దినోత్సవం పలమనేరు, అక్టోబర్ 9 ( పున్నమి ప్రతినిధి ) : ప్రపంచ తపాలా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పలమనేరు ప్రధాన పోస్టాఫీసులో ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా స్థానిక పోస్టాఫీసులో ఉత్తమ సేవలందిస్తున్న పోస్ట్‌మ్యాన్ శివయ్యను శాలువాతో కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యోగ గురు నందగోపాల్ మాట్లాడుతూ..
  • పూర్వం తపాలా, జాబు, ఉత్తరం వంటి రకరకాల పేర్లతో మనుషుల మధ్య సంబంధాలను, సమాచారాన్ని పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తంచేసేవారని గుర్తుచేశారు.

ఘనంగా ప్రపంచ తపాలా దినోత్సవం

పలమనేరు, అక్టోబర్ 9 ( పున్నమి ప్రతినిధి ) :
ప్రపంచ తపాలా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పలమనేరు ప్రధాన పోస్టాఫీసులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోస్టాఫీసులో ఉత్తమ సేవలందిస్తున్న పోస్ట్‌మ్యాన్ శివయ్యను శాలువాతో కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యోగ గురు నందగోపాల్ మాట్లాడుతూ.. పూర్వం తపాలా, జాబు, ఉత్తరం వంటి రకరకాల పేర్లతో మనుషుల మధ్య సంబంధాలను, సమాచారాన్ని పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తంచేసేవారని గుర్తుచేశారు. సమాజంలో తపాలా వ్యవస్థ పోషించిన పాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు. సామాజిక సేవాకర్త మధుమోహన్రావు మాట్లాడుతూ.. ఎంతటి దూర తీరాలైనా, వాన వచ్చినా, ఎండ కాసినా లెక్కచేయకుండా పూర్వం పోస్ట్‌మ్యాన్లు నడుచుకుంటూ లేదా సైకిళ్లపై వెళ్లేవారని తెలిపారు. జాబులు, మనీఆర్డర్లు, పెండ్లి పత్రికలను సకాలంలో చేరవేస్తూ ప్రజలకు వారు అందించిన సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో పలమనేరు పోస్ట్ మాస్టర్ జయకుమార్, భరత్, శీనన్న, పూర్ణిమ, మార్కొండ మరియు పోస్టాఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *