Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంగరంగ వైభవంగా పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతర

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అంగరంగ వైభవంగా పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతర

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 8 (పున్నమి ప్రతినిధి) పొదలకూరులో శ్రీ పోలేరమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది.
  • జాతర సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, యువనాయకులు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శృతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఉత్సవ కమిటీ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికి, ఆలయ సంప్రదాయం ప్రకారం సత్కరించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 8 (పున్నమి ప్రతినిధి)
పొదలకూరులో శ్రీ పోలేరమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. జాతర సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, యువనాయకులు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శృతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఉత్సవ కమిటీ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికి, ఆలయ సంప్రదాయం ప్రకారం సత్కరించారు. 90 ఏళ్ల తర్వాత అత్యంత వైభవంగా జాతర నిర్వహించడం ఆనందంగా ఉందని సోమిరెడ్డి అన్నారు. వేలాది మంది భక్తులు తరలిరావడం సంతోషదాయకమన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీ, అధికారులను అభినందించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *