Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పీజీ ప్రవేశాలకు 8 నుండి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పీజీ ప్రవేశాలకు 8 నుండి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం కళాశాలలు, నెల్లూరు మరియు కావలి కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
  • ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ (DOA) ఆచార్య డా.
  • హనుమా రెడ్డి తెలిపారు.

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం కళాశాలలు, నెల్లూరు మరియు కావలి కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ (DOA) ఆచార్య డా. హనుమా రెడ్డి తెలిపారు.

పీజీ ప్రవేశాలకు అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 12 నుంచి 14వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. 15వ తేదీన వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. 17వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని అధికారులు తెలిపారు.

అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డా. హనుమా రెడ్డి సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *