వార్త ముఖ్యాంశాలు
- కుషాయిగూడ: కుషాయిగూడ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతంగా మున్ముందుకు సాగుతున్నాయి.
- ఇటీవల గౌరవ రాష్ట్ర మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు రూ.
- 3.13 కోట్ల అంచనా వ్యయంతో డివిజన్లోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విషయం విదితమే.
కుషాయిగూడ:
కుషాయిగూడ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతంగా మున్ముందుకు సాగుతున్నాయి. ఇటీవల గౌరవ రాష్ట్ర మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు రూ. 3.13 కోట్ల అంచనా వ్యయంతో డివిజన్లోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విషయం విదితమే.
అందులో భాగంగా గురువారం ఆదర్శ్ నగర్ కాలనీలోని చర్చి గల్లీలో రూ రూపుదిద్దుకుంటున్న 130 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు కాలనీ వాసులతో కలిసి స్థానికంగా పరిశీలించారు. కాలనీ నివాసితులు స్వామి, శ్రీరాములు, మల్లేష్, నరసింహ, ఫైటర్ రాజుల విజ్ఞప్తి మేరకు ఈ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టినట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, ఎలాంటి లోపాలు లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు మరియు కాంట్రాక్టర్కు సూచించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ ప్రముఖులు, నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్: పున్నమి సందీప్, మేడ్చల్