Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

వైసీపీలోకి భారీ వలసలు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వైసీపీలోకి భారీ వలసలు.

వార్త ముఖ్యాంశాలు

  • .
  • టిడిపికి బిగ్ షాక్..
  • ప్రొద్దుటూరులో చేరిన 80 కుటుంబాలు కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది..

.

టిడిపికి బిగ్ షాక్..

ప్రొద్దుటూరులో చేరిన 80 కుటుంబాలు

కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.. వైఎస్‌ఆర్‌సీపీ ప్రాథమిక సిద్ధాంతాలు, పార్టీ ప్రగతి విధానాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీకి చెందిన 80 కుటుంబాలు ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి.. ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఈ చేరికల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది..
యువ నాయకత్వం, స్థానిక నేతల ఆధ్వర్యంలో..
24వ వార్డు ఇంచార్జ్ వెంకటరమణారెడ్డి, యువ నాయకుడు కొత్తపల్లె రాజేష్ల ఆధ్వర్యంలో టిడిపికి చెందిన 80 కుటుంబాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో యువకులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు..
కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు..
ఈ భారీ చేరికల కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు విశేషంగా పాల్గొన్నాయి.. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెంట పాల్గొన్న నాయకుల్లో..
మాజీ కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ పాతకోట బంగారు రెడ్డి,
మాజీ కౌన్సిలర్ పాతకోట వంశీధర్ రెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్,
వైసిపి ప్రొద్దుటూరు యువజన విభాగం గురునాథ్ రెడ్డి, వైఎస్ఆర్సిపి బీసీ సెల్ స్టేట్ కార్యదర్శి గోటూరు వెంకటేష్ తదితరులు ఉన్నారు..
ప్రజల సంక్షేమానికి వైఎస్సార్‌సీపీ నిబద్ధత..
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి వైఎస్‌ఆర్‌సీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు.. పార్టీ సిద్ధాంతాలను నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం, గౌరవం ఉంటాయని హామీ ఇచ్చారు.. స్థానిక నేతలు వెంకటరమణారెడ్డి, కొత్తపల్లె రాజేష్ ల కృషిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు..
భారీ సంఖ్యలో టిడిపి కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరడంతో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పార్టీ కేడర్‌లో నూతన ఉత్సాహం నెలకొంది..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *