Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

బాచుపల్లిలో బిఆర్‌ఎస్ పార్టీ నేత సాంబశివరెడ్డి ఉదారత: సొంత నిధులతో కాలనీ మెయిన్ గేట్ నిర్మాణ పనులు ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బాచుపల్లిలో బిఆర్‌ఎస్ పార్టీ నేత సాంబశివరెడ్డి ఉదారత: సొంత నిధులతో కాలనీ మెయిన్ గేట్ నిర్మాణ పనులు ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • బాచుపల్లి (మేడ్చల్ జిల్లా): బాచుపల్లి 2BHK కాలనీ నివాసితుల సుదీర్ఘ కల నెరవేరబోతోంది.
  • కాలనీకి ఎంతో అవసరమైన మెయిన్ గేట్ నిర్మాణ పనులను బిఆర్‌ఎస్ పార్టీ నిజాంపేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరెడ్డి సొంత ఖర్చులతో చేపట్టి తన ఉదారతను చాటుకున్నారు.
  • ​కాలనీవాసుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఆయన, గురువారం ఇంజనీర్‌తో కలసి స్థలాన్ని పరిశీలించి పిల్లర్స్ కోసం కొలతలు (మెజర్మెంట్స్) తీయించారు.

బాచుపల్లి (మేడ్చల్ జిల్లా):
బాచుపల్లి 2BHK కాలనీ నివాసితుల సుదీర్ఘ కల నెరవేరబోతోంది. కాలనీకి ఎంతో అవసరమైన మెయిన్ గేట్ నిర్మాణ పనులను బిఆర్‌ఎస్ పార్టీ నిజాంపేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరెడ్డి సొంత ఖర్చులతో చేపట్టి తన ఉదారతను చాటుకున్నారు.
​కాలనీవాసుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఆయన, గురువారం ఇంజనీర్‌తో కలసి స్థలాన్ని పరిశీలించి పిల్లర్స్ కోసం కొలతలు (మెజర్మెంట్స్) తీయించారు. అనంతరం జేసీబీ (JCB) సహాయంతో గుంతలు తీయించి, మెయిన్ గేట్ నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. కాలనీ భద్రత మరియు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తన సొంత డబ్బులతోనే గేట్ నిర్మిస్తానని ఇచ్చిన మాట ప్రకారం పనులు మొదలుపెట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
​ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ… తమ అభ్యర్థనను మన్నించి, నిస్వార్థంతో ముందుకు వచ్చి మెయిన్ గేట్ ఏర్పాటు చేస్తున్న సాంబశివరెడ్డికి కాలనీవాసులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గేటు నిర్మాణ పనులు విజయవంతంగా, వేగంగా పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ పరస్పర సహకారం అందించాలని కాలనీ ప్రతినిధులు కోరారు.
​రిపోర్టింగ్:
సందీప్, మేడ్చల్ జిల్లా పున్నమి రిపోర్టర్
బాచుపల్లి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *