Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ప్రజాసేవే నా బలం.. 140 కోట్ల భారతీయుల ఆశీస్సులే నన్ను నడిపించాయి: ప్రధాని మోడీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రజాసేవే నా బలం.. 140 కోట్ల భారతీయుల ఆశీస్సులే నన్ను నడిపించాయి: ప్రధాని మోడీ

2047 నాటికి వికసిత్ భారత్ సాధించి తీరుతాం’: ఒలింపిక్స్ ఆతిథ్యం, స్పేస్ మిషన్లు, గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ లక్ష్యాలపై ‘సేవా జ్యోతి’ వేదికగా ప్రధాని మోదీ ధీమా.ప్రజాప్రభుత్వ అధినేతగా పాతికేళ్ల నిరంతర పాలన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ‘సేవా జ్యోతిప్రజాప్రభుత్వ అధినేతగా పాతికేళ్ల

నిరంతర పాలన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ‘సేవా జ్యోతి’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని భావోద్వేగంతో ప్రసంగించారు. ప్రజలకు సేవ చేసేందుకే దేశ ప్రజానీకం తనను నిరంతరం ఎన్నుకుంటూ వస్తోందని, ఈ అద్భుత ప్రజాస్వామ్యానికి, పవిత్ర భారత రాజ్యాంగానికి తాను ప్రణమిల్లుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘సేవా జ్యోతి యాత్ర’లో పాల్గొంటున్న దేశ పౌరులందరికీ హృదయపూర్వక అభినందనలు ఆయన తెలిపారు. అంతకుముందు ఉదయాన్నే శ్రీ వినాయక మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసినట్లు గుర్తుచేసుకున్న మోడీ.. యావత్ దేశం కోసం, 140 కోట్ల మంది భారత ప్రజల సంక్షేమం కోసం సర్వశక్తిమంతుడైన భగవంతుడిని ప్రార్థించానని చెప్పారు. దేశ సేవ కోసం మరింత నూతనోత్సాహంతో, శక్తిసామర్థ్యాలతో పనిచేసే ఆశీస్సులను తనకు ప్రసాదించాలని భగవంతుడిని వేడుకున్నానని వెల్లడించారు.వరుసగా 25 సంవత్సరాల పాటు ప్రభుత్వ అధినేతగా కొనసాగే అదృష్టం దక్కడం ప్రజల ఆశీర్వాదం వల్లే సాధ్యమైందని చెబుతూ, దేశ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను ప్రమాణస్వీకారం చేసిన నాటి రోజును గుర్తుచేసుకుంటూ.. తన ప్రజా జీవితంలో ఇంతటి సుదీర్ఘమైన, చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంటానని ఆనాడు కలలో కూడా ఊహించలేదని అన్నారు. సీఎం నుంచి ప్రధాని వరకు సాగిన ఈ ప్రస్థానంలో దేశ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేశానని, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధన దిశగా మరింత పట్టుదలతో ముందుకు సాగుతానని ఆయన పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ‘సేవా జ్యోతి యాత్ర’ సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగం సభలో హాజరైన వేలాది మంది కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది.

ప్రజాసేవే నా బలం.. 140 కోట్ల భారతీయుల ఆశీస్సులే నన్ను నడిపించాయి: ప్రధాని మోడీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *