Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

పాఠశాల విద్యార్థి భద్రతలో నిర్లక్ష్యం..కలెక్టర్ తీవ్ర ఆగ్రహం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పాఠశాల విద్యార్థి భద్రతలో నిర్లక్ష్యం..కలెక్టర్ తీవ్ర ఆగ్రహం

అక్టోబర్ 07 పున్నమి ప్రథినిది నిర్మల్ జిల్లా
తానూర్ మండలం బెంబర్ ప్రాథమికోన్నత పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల సమయం ముగిసిన అనంతరం తరగతి గదిలోనే ఉండిపోగా, గది తాళం వేసిన ఘటనపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల భద్రత విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి. స్వప్నను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా విధి నిర్వహణలో అలసత్వం వహించిన పాఠశాల స్కావెంజర్‌ను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ బుధవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
పాఠశాల ముగింపు సమయంలో ప్రతి విద్యార్థి సురక్షితంగా పాఠశాల నుంచి బయటకు వెళ్లాడా లేదా అనే విషయాన్ని ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రత విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యానికి తావు లేకుండా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా చర్యలను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల ప్రారంభం నుంచి ముగింపు వరకు విద్యార్థుల భద్రతకు సంబంధించి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యార్థుల రక్షణ, భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని, భవిష్యత్తులో జిల్లాలోని ఏ పాఠశాలలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

పాఠశాల విద్యార్థి భద్రతలో నిర్లక్ష్యం..కలెక్టర్ తీవ్ర ఆగ్రహం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *