వార్త ముఖ్యాంశాలు
- చెన్నారావుపేట, అక్టోబర్ 6 ( పున్నమి): ఉప్పరపల్లి గ్రామం మీదుగా ఆర్టీసీ బస్సు సర్వీసుల సంఖ్యను పెంచాలని ఉప్పరపల్లి గ్రామస్తులు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, డిపో మేనేజర్ ను కోరారు.
- మంగళవారం ఈ మేరకు వారికి వేరువేరుగా వినతి పత్రాలను అందించారు.
- ఉప్పరపల్లి గ్రామం నుండి విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామస్తులు ప్రతిరోజూ వివిధ పనుల నిమిత్తం నర్సంపేట, వరంగల్ పట్టణాలకు నిత్యం ప్రయాణిస్తుంటారన్నారు.
చెన్నారావుపేట, అక్టోబర్ 6 ( పున్నమి): ఉప్పరపల్లి గ్రామం మీదుగా ఆర్టీసీ బస్సు సర్వీసుల సంఖ్యను పెంచాలని ఉప్పరపల్లి గ్రామస్తులు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, డిపో మేనేజర్ ను కోరారు. మంగళవారం ఈ మేరకు వారికి వేరువేరుగా వినతి పత్రాలను అందించారు. ఉప్పరపల్లి గ్రామం నుండి విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామస్తులు ప్రతిరోజూ వివిధ పనుల నిమిత్తం నర్సంపేట, వరంగల్ పట్టణాలకు నిత్యం ప్రయాణిస్తుంటారన్నారు. సమయానుకూలంగా బస్సు సర్వీసులు నడవకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మొదటి సర్వీసు ఉదయం ఉదయం 06:30 గంటలకు నర్సంపేట నుండి బయలుదేరి 07:00 గంటలకు ఉప్పరపల్లి మీదుగా 08:00 గంటలకు వరంగల్ చేరాలని తిరిగి ఉదయం 08:00 గంటలకు వరంగల్ నుండి బయలుదేరి.. 09:00 గంటలకు ఉప్పరపల్లి మీదుగా 09:30 నర్సంపేటకు చేరాలన్నారు. రెండవ సర్వీసు ఉదయం 09:30 గంటలకు నర్సంపేట నుండి బయలుదేరి 10:00 గంటలకు ఉప్పరపల్లి మీదుగా 11:00 గంటలకు వరంగల్ చేరాలని తిరిగి మధ్యాహ్నం 11:00 గంటలకు వరంగల్ నుండి బయలుదేరి 12:00 గంటలకు ఉప్పరపల్లి మీదుగా 12:30 నర్సంపేటకు చేరాలని మూడవ సర్వీసు సాయంత్రం 05:00 గంటలకు నర్సంపేట నుండి బయలుదేరి 05:30గంటలకు ఉప్పరపల్లి మీదుగా 06:30 గంటలకు వరంగల్ చేరాలని తిరిగి రాత్రి 07:00 గంటలకు వరంగల్ నుండి బయలుదేరి 08:00 గంటలకు ఉప్పరపల్లి మీదుగా 08:30 నర్సంపేటకు చేరే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెరుమాండ్ల మల్లారెడ్డి, సుధన్ రెడ్డి, పొలాటి గణపతి రెడ్డి, కోత్వాల రాజు, తదితరులు పాల్గొన్నారు.