వార్త ముఖ్యాంశాలు
- కలిగిరి, అక్టోబర్ 6: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు.
- కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెంలో రూ.36 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఎన్‌హెచ్‌ఎం నిధులతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్–ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
- అనంతరం రూ.6 లక్షల వి.బి.జి.
కలిగిరి, అక్టోబర్ 6: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెంలో రూ.36 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఎన్‌హెచ్‌ఎం నిధులతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్–ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రూ.6 లక్షల వి.బి.జి. రాంజీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, మౌలిక వసతులను దశలవారీగా మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.