వార్త ముఖ్యాంశాలు
- కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 5 (పున్నమి న్యూస్): కాకినాడ జిల్లా యువతకు స్థానికంగానే నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో "స్కిల్, స్టార్టప్, భారత్ హబ్"ను ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు.
- సోమవారం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో రూ.5.30 కోట్ల రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన తొలి దశ స్కిల్ సెంటర్ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, శాసనమండలి సభ్యులు పేరాఒత్తుల రాజ శేఖరం, కర్రి పద్మశ్రీ, కాకినాడ అర్బన్,రూరల్,పెద్దా పురం,ప్రత్తిపాడు శాసన సభ్యులు వనమాడి…
- ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ‘కాకినాడ జిల్లా కోసం’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఇంటింటికీ, ప్రతి విద్యార్థికి క్వశ్చనేర్ ఇచ్చి సర్వే నిర్వహించామని వివరించారు.
కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 5 (పున్నమి న్యూస్):
కాకినాడ జిల్లా యువతకు స్థానికంగానే నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో “స్కిల్, స్టార్టప్, భారత్ హబ్”ను ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు.
సోమవారం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో రూ.5.30 కోట్ల రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన తొలి దశ స్కిల్ సెంటర్ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, శాసనమండలి సభ్యులు పేరాఒత్తుల రాజ శేఖరం, కర్రి పద్మశ్రీ, కాకినాడ అర్బన్,రూరల్,పెద్దా పురం,ప్రత్తిపాడు శాసన సభ్యులు వనమాడి వెంకటేశ్వర రావు,పంతం నానాజీ, నిమ్మకాయల చిన్న రాజప్ప, వరుపుల సత్యప్రభ,డి సి సి బి చైర్మన్ తుమ్మల రామస్వామిలతో కలసి రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ‘కాకినాడ జిల్లా కోసం’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఇంటింటికీ, ప్రతి విద్యార్థికి క్వశ్చనేర్ ఇచ్చి సర్వే నిర్వహించామని వివరించారు. ఆ సర్వేలో 80 శాతం మంది ప్రధానంగా ఉద్యోగాలు, ఉపాధి సమస్యలపైనే దృష్టి సారించాలని కోరడంతో, దానిపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించు కున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత, ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు,గత రెండేళ్లుగా స్థానిక శాసనసభ్యులు ఎవరూ తమకు రోడ్లు, డ్రెయిన్లు లేదా నిధులు కావాలని అడగకుండా,కాకినాడ యువతకు ఉద్యోగాలు ఇచ్చేలా ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని తనను ప్రోత్సహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
స్థానిక యువతకు భవిష్యత్తు పునాదులు వేయడమే తమ ప్రధాన ఆలోచన అని స్పష్టం చేశారు. ఈ హబ్ ద్వారా కేవలం శిక్షణ (స్కిల్) మాత్రమే కాకుండా, ముఖ్యమంత్రి విజన్ ‘వన్ హోమ్ – వన్ ఎంటర్ప్రెన్యూర్’ (ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త) అనుగుణంగా ప్రతీ ఇంటి నుండి ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చేలా ఇన్క్యూబేషన్, స్కిల్ డెవలప్మెంట్ సేవలు అందిస్తామన్నారు.
ఇది దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక వినూత్నమైన హైబ్రిడ్ మోడల్ సెంటర్ అని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మోడల్‌ను కూడా ఇందులో సమ్మిళితం చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టును రూ. 15 నుండి 20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని, మొదటి దశలో స్కిల్ సెంటర్, రెండో దశలో తుని, కోనసీమ వంటి దూర ప్రాంతాల విద్యార్థులు ఇక్కడే ఉండి శిక్షణ పొందేందుకు వసతి (హాస్టల్) సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
ఇప్పటికే కాకినాడ చుట్టుపక్కల ఉన్న దివీస్ ఫార్మా, అరబిందో ఫార్మా, ఎఎం గ్రీన్, కోరమండల్ ఫెర్టిలైజర్స్ వంటి ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులతో మాట్లాడామని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలలోనే యువతకు శిక్షణనిచ్చి నేరుగా ఎంప్లాయిమెంట్ కల్పించేలా ఒప్పందాలు చేసుకుంటున్నామని తెలిపారు.
అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , సైబర్ సెక్యూరిటీ, వెబ్ డెవలప్మెంట్, డ్రోన్, అగ్రిటెక్, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా స్థానిక కళాశాలల సహాయంతో ఇప్పటికే శిక్షణ ప్రారంభించామని, ఐదు నెలల క్రితం బెంగళూరు నుండి వచ్చిన శిక్షకుల ద్వారా 35 మందికి జావాలీ శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కూడా కల్పించామని వెల్లడించారు.
గవర్నమెంట్ ఐటిఐ ప్రాంగణంలో ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో ఈ హబ్‌ను నిర్మిస్తున్నామని, అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనల మేరకు ఐటిఐల పునరుద్ధరణలో భాగంగా ఇక్కడ న్యాక్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కాకినాడ జిల్లా నుండి ఏటా 20,000 మంది వివిధ కోర్సుల విద్యార్థులు బయటకు వస్తున్నారని, ప్రస్తుతానికి ఏటా 1,000 మందికి నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పించడంతో పాటు 100 మందిని ఎంటర్ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు.ఈ సెంటర్లో డిజిటల్ లైబ్రరీ, మెంటార్స్ సేవలు, ప్రభుత్వ స్కీమ్‌లు పొందేలా ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇది ప్రభుత్వం లేదా ఎంపీ, ఎంఎల్ఏల సొంత కార్యక్రమం కాదని, కాకినాడ ప్రజలందరిది అని పేర్కొంటూ, స్థానిక వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు భాగస్వాములై సలహాలు, సహకారం అందించాలని ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు సహనార్ సతీష్ బాబుని ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కలిసి ఘనంగా సన్మానించారు