వార్త ముఖ్యాంశాలు
- కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 5(పున్నమి న్యూస్): కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఎస్పీ జి.
- బిందుమాధవ్ మొత్తం 43 ఫిర్యాదులను స్వీకరించారు .
- వాటిలో భూ తగాదాలు 8, కుటుంబ కలహాలు 8 మరియు ఇతర విభాగాలకు చెందినవి 27 గా గుర్తించబడ్డాయి.ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత స్టేషన్ అధికారులను ఆదేశిస్తూ, “ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి వాస్తవాలు నిర్ధారించగానే, తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఏడు రోజుల లోపు విచారణ…
కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 5(పున్నమి న్యూస్):
కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఎస్పీ జి. బిందుమాధవ్ మొత్తం 43 ఫిర్యాదులను స్వీకరించారు . వాటిలో భూ తగాదాలు 8, కుటుంబ కలహాలు 8 మరియు ఇతర విభాగాలకు చెందినవి 27 గా గుర్తించబడ్డాయి.ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత స్టేషన్ అధికారులను ఆదేశిస్తూ, “ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి వాస్తవాలు నిర్ధారించగానే, తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఏడు రోజుల లోపు విచారణ పూర్తిచేసి, తగిన పరిష్కారం చూపాలని, వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను విన్న ఎస్పీ ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని, ప్రజా సమస్యలను న్యాయపరంగా పరిష్కరించడంలో కాకినాడ జిల్లా పోలీసులు పూర్తి నిబద్ధతతో పని చేస్తున్నారని తెలిపారు.