చిన్నక్రాక గ్రామం వద్ద ఎన్ హెచ్ -167 బిజీ పై ఘటన
తలకు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి.
జలదంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నక్రాక గ్రామం వద్ద ఎన్ హెచ్ -167 బిజీ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న చెరుకూరి రమేష్ (58) అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల వివరాల మేరకు.. కావలి మండలం అడవి రాజుపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి రమేష్ తన పొలాలను చూసుకునేందుకు పరికోట గ్రామానికి వెళ్లి, అనంతరం తన ఏపీ 26 ఏపీ 3701 బైక్‌పై కావలికి బయలుదేరాడు. చిన్నక్రాక గ్రామం సమీపంలో ఎన్ హెచ్ -167 బిజీ రోడ్డుపై అకస్మాత్తుగా బర్రెలు అడ్డురావడంతో బైక్‌ను అదుపు చేయలేక వాటిని ఢీకొన్నాడు.
ఈ ప్రమాదంలో రమేష్ రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు చెబుతున్నారు. ఘటనపై జలదంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
