వార్త ముఖ్యాంశాలు
- నర్సంపేట: వ్యాపారంలో తూకాల్లో మోసాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని వరంగల్ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి కే.
- మనోహర్ స్పష్టం చేశారు.
- ఆదివారం నర్సంపేట పట్టణంలోని చేపలు, చికెన్, మాంసం మరియు పండ్ల దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
నర్సంపేట: వ్యాపారంలో తూకాల్లో మోసాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని వరంగల్ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి కే. మనోహర్ స్పష్టం చేశారు. ఆదివారం నర్సంపేట పట్టణంలోని చేపలు, చికెన్, మాంసం మరియు పండ్ల దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో తూనికలు, కొలతల పరికరాలకు సకాలంలో ధృవీకరణ చేయించుకోకుండా, శాఖ ముద్రలు లేకుండా వ్యాపారం చేస్తున్న 15 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. వ్యాపారులందరూ తమ తూకపు యంత్రాలను నిర్ణీత గడువులోగా తనిఖీ చేయించి, అధికారిక ముద్రలు వేయించుకోవాలని సూచించారు.
వినియోగదారులకు సరైన తూకంతోనే సరుకులు అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే వినియోగదారులు కూడా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తూకాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని కోరారు.