Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

​మా భూమిలోని మిరప తోటను దున్నేసి నష్టం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలి: బాధితుడి డిమాండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
​మా భూమిలోని మిరప తోటను దున్నేసి నష్టం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలి: బాధితుడి డిమాండ్

వార్త ముఖ్యాంశాలు

  • నల్లబెల్లి: పొలం సరిహద్దు వివాదం కారణంతో తమ పట్టా భూమిలోకి అక్రమంగా చొరబడి, మిరప తోటను ట్రాక్టర్‌తో దున్నేసి తీవ్ర నష్టం కలిగించిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నల్లబెల్లి మండలం నర్సంపేట గ్రామానికి చెందిన రైతు సంగీ మనోహర్ డిమాండ్ చేశారు.
  • ​ఆదివారం (04-10-2026) సాయంత్రం సమయంలో నర్సంపేట శివారులోని తన సర్వే నంబర్ 275/B/1లో గల పట్టా భూమిలో వేసిన మిరప తోటను, గ్రామానికి చెందిన వక్కల వెంకటేశ్వర్లు మరియు అతని బంధువులు వక్కల యుగంధర్ రెడ్డి కలసి అక్రమంగా ప్రవేశించి ట్రాక్టర్‌తో దున్ని వేసినట్లు తెలిపారు.
  • గట్టు తగాదా మనస్సులో పెట్టుకొని సుమారు రూ.

నల్లబెల్లి: పొలం సరిహద్దు వివాదం కారణంతో తమ పట్టా భూమిలోకి అక్రమంగా చొరబడి, మిరప తోటను ట్రాక్టర్‌తో దున్నేసి తీవ్ర నష్టం కలిగించిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నల్లబెల్లి మండలం నర్సంపేట గ్రామానికి చెందిన రైతు సంగీ మనోహర్ డిమాండ్ చేశారు.
​ఆదివారం (04-10-2026) సాయంత్రం సమయంలో నర్సంపేట శివారులోని తన సర్వే నంబర్ 275/B/1లో గల పట్టా భూమిలో వేసిన మిరప తోటను, గ్రామానికి చెందిన వక్కల వెంకటేశ్వర్లు మరియు అతని బంధువులు వక్కల యుగంధర్ రెడ్డి కలసి అక్రమంగా ప్రవేశించి ట్రాక్టర్‌తో దున్ని వేసినట్లు తెలిపారు. గట్టు తగాదా మనస్సులో పెట్టుకొని సుమారు రూ. 10,000/- ల విలువైన మిరప తోటను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
​ఈ విషయమై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. ఆక్రమణకు పాల్పడి నష్టం కలిగించిన వ్యక్తులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *