Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

గోవా జాతీయ క్రీడా పోటీల్లో తెలంగాణ కబడ్డీ జట్టుకు ప్రథమ స్థానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గోవా జాతీయ క్రీడా పోటీల్లో తెలంగాణ కబడ్డీ జట్టుకు ప్రథమ స్థానం

గోవాలో నిర్వహించిన YSDA India Multi Sports Championship 2026 జాతీయ క్రీడా పోటీల్లో తెలంగాణ అండర్‌-14 బాలుర కబడ్డీ జట్టు అద్భుత ప్రదర్శనతో ప్రథమ స్థానాన్ని సాధించింది. ఈ విజయంలో తెలంగాణకు చెందిన క్రీడాకారులు శ్రీచరణ్, రాఘవేంద్ర, అమానుద్దీన్ కీలక పాత్ర పోషించారు.

జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జట్టు విజయానికి తోడ్పడిన ముగ్గురు క్రీడాకారులను తెలంగాణ క్రీడా ప్రతినిధులు అభినందించారు. వారి కృషి, పట్టుదల జట్టు విజయానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రెసిడెంట్ దోమల నవీన్ కుమార్, సెక్రటరీ ప్రదీప్ కుంటి రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, తెలంగాణ కబడ్డీ హెడ్ కోచ్ భూపాల్ జట్టు విజయంపై హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం గర్వకారణమని పేర్కొంటూ క్రీడాకారుల ప్రతిభను ప్రశంసించారు.

క్రీడాకారుల విజయాల్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం కూడా కీలకమని వారు గుర్తుచేశారు. యువ క్రీడాకారులు ఇదే ఉత్సాహంతో ముందుకు సాగి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

గోవా జాతీయ క్రీడా పోటీల్లో తెలంగాణ కబడ్డీ జట్టుకు ప్రథమ స్థానం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *