డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రజల చిరకాల స్వప్నమైన కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. భూసేకరణ కోసం రాష్ట్ర వాటాగా ఈ నిధులను కేటాయించడం ద్వారా ప్రాజెక్టు పనులకు మరింత ఊపునిచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కోనసీమ అభివృద్ధిలో కీలక అడుగుగా పేర్కొనబడింది. ఈ ప్రాజెక్టు కోసం కృషి చేసిన లోకసభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 75వ జయంతి రోజున నిధులు విడుదల కావడం ప్రత్యేకత సంతరించుకుంది. నిధుల మంజూరుతో రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ నిర్ణయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
