జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల ఓటర్ల జాబితాలో ఉన్న అభ్యంతరాలు, కులాల వారీగా ఓటర్ల వివరాలు, వార్డుల రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవీఎంసీ అదనపు కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు కె.కె. రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు పార్టీ అధ్యక్షులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలోని అభ్యంతరాలను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వార్డుల రిజర్వేషన్లకు సంబంధించిన అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్, దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, శాసన మండలి సభ్యుడు కుంభ రవిబాబు, మాజీ శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి, మాజీ ఉప మేయర్లు కటామురి సతీష్, జియ్యాని శ్రీధర్, పక్ష నాయకుడు బాణాల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు జహీర్ అహ్మద్, సతీష్ వర్మ, పళ్ళ దుర్గ, పి.వి. నారాయణ్, జి.వి. రవి రాజు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ పరిశీలకురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు.
విశాఖపట్నం
ఓటర్ల జాబితా అభ్యంతరాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినతి