Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

తాడిపూడి హత్య కేసులో ఇంకా విడని చిక్కు ముడి

తూర్పు గోదావరి జిల్లా, తాళ్ళపూడి మండలం (పున్నమి ప్రతినిధి) గోదావరి నదిలో ఆదిలక్ష్మి ఆచూకీ కనిపెట్టడం కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గత నెల 28వ తేదీ రాత్రి, తాళ్లపూడి మండలం తాడిపూడిలో ఆమెను హత్య చేసి నదిలో పడేసినట్లు నిందితుడు షేక్ యాకోబు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. దీనితో అతడిని పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. సాధారణంగా మనిషి నీటిలో మునిగి చనిపోతే మృతదేహం 24 గంటల్లో పైకి తేలుతుందని, కానీ 6 రోజులు గడుస్తున్నా ఎలాంటి జాడ లేకపోవడంతో ఆమెను నిజంగా నదిలోనే పడేశాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *