వార్త ముఖ్యాంశాలు
- నంద్యాల : మహాత్మా గాంధీజీ 157వ జయంతిని పురస్కరించుకుని నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం గాంధీజీ చిత్రపటానికి తహసీల్దార్ ఎం.
- శ్రీవాణి, రెవెన్యూ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం.
- శ్రీవాణి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీజీ చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమన్నారు.
నంద్యాల : మహాత్మా గాంధీజీ 157వ జయంతిని పురస్కరించుకుని నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం గాంధీజీ చిత్రపటానికి తహసీల్దార్ ఎం. శ్రీవాణి, రెవెన్యూ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం. శ్రీవాణి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీజీ చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలను ఆయుధాలుగా చేసుకుని ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. గాంధీజీ ఆశయాలను నేటి తరానికి తెలియజేస్తూ ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు.దేశంలో శాంతి, సామరస్యం, సోదరభావం పెంపొందించేందుకు గాంధీజీ బోధించిన విలువలను ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాసేవలో నిజాయితీ, నిబద్ధతతో పనిచేయడం ద్వారా గాంధీజీ ఆశయాలకు నిజమైన గౌరవం ఇవ్వాలని తెలిపారు.
కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు రామచంద్రరావు, ఎం.వి.ఎస్.ఎస్. శేఖర్‌రెడ్డి, శూలం విజయశేఖర్, ఎంఆర్ఐ మాధవీరెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.