Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో గిర్నిబావిలో ఘనంగా ఉచిత మెగా వైద్య, కంటి వైద్య శిబిరం

నర్సంపేట నియోజకవర్గం, దుగ్గొండి మండలం గిర్నిబావిలోని కనిష్క ఫంక్షన్ హాల్‌లో జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో, బంధన్ హాస్పిటల్స్ మరియు శంకర కంటి ఆసుపత్రి సంయుక్త సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం, 4వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు.
​ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడం అభినందనీయమని, డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి సేవలు ఉమ్మడి వరంగల్ జిల్లాకే స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
​ఈ శిబిరంలో శంకర కంటి ఆసుపత్రి వైద్యులు 1,178 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స అవసరమైన 93 మందిని ఉచిత ఆపరేషన్ల కోసం హైదరాబాద్‌కి ఎంపిక చేశారు. అలాగే బంధన్ హాస్పిటల్స్ విభాగం నుండి 12 మంది నిపుణులైన డాక్టర్లు దాదాపు 900 మందికి పైగా రోగులకు వివిధ విభాగాలలో పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *