నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
രചയിതൃ പാനൽ
ఖమ్మం

కూసుమంచిలో ప్రయాణికుల సమస్యలపై సంతకాల సేకరణ

కూసుమంచి, అక్టోబర్ 2:
కూసుమంచి మండల కేంద్రంలో ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు టీడబ్ల్యూఎంఎఫ్ జిల్లా ఇన్‌చార్జి గుండా ఉపేందర్ రెడ్డి తెలిపారు. వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

కూసుమంచిలో బస్‌స్టాండ్ లేకపోవడంతో విద్యార్థులు, మహిళలు, గర్భిణులు సహా నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌కు సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో పాటు, పలు సర్వీసులు బైపాస్ మీదుగా వెళ్లడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.

ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు ఉదయం 4, 4.30 గంటలకు నడిచే ఎక్స్‌ప్రెస్ సర్వీసులను పునరుద్ధరించాలని, కూసుమంచి మీదుగా ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు నడపాలని కోరారు. బైపాస్ వద్ద రాజధాని బస్సులకు స్టాప్ సౌకర్యం కల్పించాలని, రద్దీ సమయంలో ప్రత్యేక బస్సుల పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేయడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

సేకరించిన సంతకాల ప్రతులను స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ చైర్మన్ నాగిరెడ్డికి అందజేస్తామని గుండా ఉపేందర్ రెడ్డి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *